మంచు మ‌నోజ్ విడాకుల వెన‌క అసలు ఏం జ‌రిగింది…!

-

టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో వైవాహిక బంధం ముగిసింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెద్ద బాంబు పేల్చారు. ఆయన తన భార్య ప్ర‌ణ‌తి నుంచి విడాకులు తీసుకున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము మా వివాహ బంధానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం. ఇది బాధకలిగించే అంశం ఐనప్పటికీ ఒకరి మనో భావాలను మరొకరు గౌరవించే వారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకరి వ్యక్తిగత జీవితం పట్ల మరొకరికి మాకు గౌవరం వుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది” అని చెప్పుకొచ్చారు.

2015లో మనోజ్ – ప్రణతి వివాహం జరిగినా.. ఆ మ‌రుస‌టి ఏడాది నుంచే వీరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తడంతో వేరువేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మనోజ్ భార్య‌ నుంచి దూరంగా ఉంటున్నాడు అన్న వార్త ఏడాదిన్నర క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై మనోజ్ అప్పట్లో క్లారిటీ ఇస్తూ భార్యతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశాడు. ఇక వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వ‌చ్చింద‌న్న దానిపై ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు ఉన్నాయి.

మనోజ్ సినిమారంగంలో హీరోగా బిజీబిజీగా ఉండ‌డం ప్ర‌ణ‌తికి పెద్దగా నచ్చలేదని… ఆ విషయంలో తరచూ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తటం చిన్న చిన్న విషయాలే చివరకు పెద్దవి కావడంతో వీరు విడిపోక తప్పలేదు అని తెలుస్తోంది. ఇక ప్రణ‌తి ఏడాది కాలంగా అమెరికాలోనే ఉంటూ ఇండియా రావడం లేదని కూడా తెలుస్తోంది. వీరిని కలిపేందుకు అటు ప్ర‌ణ‌తి కుటుంబ సభ్యులతో పాటు ఇటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడంతో చివరకు విడిపోక‌ తప్పలేదు.

సహజంగానే సినిమా రంగంలో ఉన్న వాళ్లు వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు తక్కువ టైం ఉంటుంది. ఈ చిన్న విషయంలో ఏర్పడిన విభేదాలు ఈ దంప‌తులు విడిపోవడానికి ప్రధాన కారణమట‌. మరి దీనిపై మోహన్‌బాబు ఫ్యామిలీ లేదా ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version