సాధారణంగా బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఒక ప్లేటు బిర్యానీ ధర కనీసం వంద రూపాయలపైనే ఉంటుంది. కానీ, తమిళనాడు రాష్ట్రం ఆర్కే నగర్‌లోని దిండుక్కల్‌లో ఉన్న ఓ హోటల్ యాజమాన్యం బుధవారం రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం ఐదు పైసలకే ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించారు. కానీ అయిదు పైసలు అంటే గతంలో చలామణిలో ఉన్నా అయిదు పైసలు తీసుకువస్తేనే ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందిస్తారు.
సోషల్ మీడియాలో కొద్ది రోజుల కింద ముజిబ్ బిర్యానీ ఐదు పైసలకే ప్లేటున్నర చికెన్ బిర్యానీ అని, మొదటి 100 మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని ప్రకటించింది. దీనితో అక్కడికి అయిదు పైసలు తీసుకొని చాలా మంది వచ్చారు. అలా తీసుకొని వచ్చిన వారికి ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించింది ముజిబ్ బిర్యానీ.. దీనికి గాను మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిపై యజమాని ముజిఫ్ రహ్మాన్ మాట్లాడుతూ… ఇలా ఆఫర్ పెట్టడానికి గల కారణం ఏంటంటే.. భవిష్యత్తు తరానికి మనం వాడిన వస్తువులను తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.