రికార్డు సృష్టించిన ‘సలార్’ ఫస్ట్ డే కలెక్షన్స్

-

పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌ల‌ను చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.

సలార్‌ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.178.7 కోట్ల వ‌సూళ్లు రాబట్టింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక ఈ క‌లెక్ష‌న్స్‌లో ఇండియా వైడ్ రూ.135 కోట్లు రాగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని స‌మాచారం. ఇక ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా సలార్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అంతకుముందు ఈ రికార్డు రూ.140 కోట్ల గ్రాస్​తో విజయ్ నటించిన ‘లియోతో పాటు ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ చిత్రాలపై ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news