పవన్‌ కళ్యాణ్ కి షాక్‌.. పోటీలో జాతీయ జనసేన పార్టీ

-

రానున్న ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పార్టీకి కొత్త టెన్షన్ వెంటాడుతోంది. జనసేనకు ఇప్పటి వరకు గ్లాస్ గుర్తు ఉంది. ఈ గుర్తే ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఈ సారి ఆ గుర్తు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని డి.నాగేశ్వరరావు ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఆ పార్టీకి ఈసీ బకెట్‌ గుర్తును కేటాయించింది. అయితే తమకు గ్లాస్‌ గుర్తును కేటాయించాలని ఈసీకి JJSP విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్‌ జాబితాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ గ్లాస్‌ గుర్తును ఎవరికి కేటాయిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ కి కేటాయిస్తుందని అభిమానులు పేర్కొంటుండటం గమనార్హం. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు. ఇందుకు ఉదాహరణ ఇదేనని స్పష్టం చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news