కొరియ‌న్ సినిమా రీమేక్ లో నివేదా, రెజీనా.. యాక్ష‌న్ ఇర‌గ‌దీస్తున్న ముద్దుగుమ్మ‌లు

ఒక‌రేమో గ్లామ‌ర్ కు కేరాఫ్ అడ్ర‌స్‌. మ‌రొక‌రేమో అందం, అభిన‌యం క‌ల‌గ‌లిసిన ముద్దుగుమ్మ‌. వీరిద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. కానీ ఇద్ద‌రూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లే. వారిద్ద‌రూ ఇప్పుడు క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇంత‌కీ వారెవ‌రా అనుకుంటున్నారా వారేనండి.. నివేదా థామ‌స్‌, రెజీనా క‌సాండ్రా.

ఇప్పుడు వీరిద్ద‌రూ ఓ సెన్సేష‌న్ రీమేక్ తో ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. షాకిని డాకినీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్నారు ఈ ముద్దు గుమ్మ‌లు. ఇక ద‌క్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన డ్యాన్సింగ్ క్వీన్, లక్కీ కీ, మిడ్ నైట్ రన్నర్స్ అనే మూడు సినిమాల హక్కులను నిర్మాత సురేష్ బాబు ద‌క్కించుకున్నారు.

ఇక ఇందులో మిడ్‌నైట్ ర‌న్న‌ర్ సినిమాని షాకిని, డాకినిగీ తీయ‌నున్నారు. ఇందులో షాకినిగా రెజీనా, డాకినిగా నివేదా థామ‌స్ క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రూ ట్రైనీ పోలీస్ ఆఫీస‌ర్లుగా యాక్ష‌న్ సీన్లు చేస్తారంట‌. ఇక దీని షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు స్పీడ్ గా జ‌రిగింది. అయితే ఇప్పుడు క‌రోనాతో వాయిదా ప‌డింది. ఈ సినిమాలో ఇద్ద‌రూ గ్లామ‌ర్ డోస్ ను పెంచ‌నున్ట్టు తెలుస్తోంది.