“విరాటపర్వం” నుంచి ‘రానా’ పాడిన పాట రిలీజ్.. ఎప్పుడంటే..

-

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుపాటి కథానాయకుడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం విరాటపర్వం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నక్సలిజానికి ప్రేమకథను జోడించి రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. వరుస అప్డేట్ లతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో బిగ్ అప్డేట్ ను ప్రకటించారు చిత్రబృందం. ‘చలో చలో’ అంటూ సాగే వారియర్ సాంగ్ ను ఆదివారం(జూన్12) విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను స్వయంగా రానా ఆలపించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version