కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది.. చెప్పింది చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా పై విధి విధానాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని కేటీఆర్ అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు.
24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు బట్టారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రోడ్ల అమ్మకంతో వచ్చిన డబ్బులను రైతు బంధు నిధులకు మళ్లించారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీని అభివృద్ధి చేసి నల్గొండ జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావ బావమరుదులు అడ్డు పడుతున్నారని ఫైర్ అయ్యారు. తాము బతకాలని లేకుంటే విషం ఇచ్చి చంపండి అని అసహనం వ్యక్తం చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.