పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి తన పోస్టుతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. అందులో వ్యక్తిగతంగా పవన్ తనను మోసం చేశారని చెబుతూనే.. రాజకీయంగా అతడికే తన మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆరోపణలు.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె మరో పోస్టు చేశారు.
“నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశారనే నిజాన్ని మాట్లాడితే గతంలో ఆయన అభిమానులు చాలా దారుణంగా అసభ్యపదజాలంతో తిట్టారు. ఇప్పుడు ఓ దేశ పౌరురాలిగా ఆయనకు అనుకూలంగా కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు ఆయన్ను ద్వేషించేవారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు. గతంలో విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి మాట్లాడినప్పుడు.. డబ్బులు తీసుకుని అలా అన్నానని ఆరోపించారు. ఇప్పుడు కూడా అలానే అంటున్నారు. అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాన్నే చెప్పాను. ఒక్క మాట తప్పుగా చెప్పలేదు. ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. ఇదే నా విధి అయితే అలాగే ఉండనీయండి. ఇంకా అనండి నన్ను” అని రేణూ దేశాయ్ పోస్టులో రాసుకొచ్చారు.
View this post on Instagram