VIRAL : మంత్రి ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడంపై RGV సెటైర్లు..

-

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ గురించి.. ప్రత్యేకంగా… చెప్పనక్కర్లేదు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఎప్పుడూ ఏదో ఓ విషయం పై ఏదో ఓ ట్వీట్‌ చేస్తూ… వివాదాలకు తెర లేపుతుంటారు.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు చేయడమే కాకుండా… రెగ్యులర్ గా అక్కడి రాజకీయాలపై కామెంట్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.అయితే..

తాజాగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ను టార్గెట్‌ చేశారు. కొండా సినిమా చేస్తున్నప్పటి నుంచి ఎర్రబెల్లి..అడ్డుపడుతుండటంతో… అప్పటి నుంచి ఆయన వర్మ సెటైర్లు పేల్చుతున్నారు. ఇక తాజాగా ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోను ట్వీట్‌ చేశారు వర్మ. ”ఒక తల్లి, తండ్రికి పుట్టినవాడు పార్టీలు మారరు. మంత్రి పదవి కోసం అస్సలు మారబోను” అంటూ ఎర్రబెల్లి ఆ వీడియోలో చెప్పారు. అయితే.. ప్రస్తుతం ఎర్రబెల్లి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ చేరి… మంత్రి పదవి అనుభవిస్తున్నారు. దానికి కౌంటర్‌ గానే తాజాగా వర్మ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కు సెటైర్లు పేల్చుతున్నారు. పార్టీ మారి.. మంత్రి పదువులు కొట్టేయడమేంటని నిలదీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version