బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. చాలా గ్యాప్ తర్వాత కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపు ఫలించింది.
ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రేటు చూసి చాలా మంది వామ్మో ఇంత ధరనా అని ముక్కున వేలేసుకుంటునన్నారు. మరికొందరేమో థియేటర్లో టికెట్ ధర కంటే ఎక్కువగా ఉంది గా బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక థియేటర్లో చూడటం మిస్ అయిన వాళ్లు ధర ఎక్కువైనా సరే చూడాలని ఫిక్స్ అయిపోయి సినిమాను ఓటీటీలో చూసేస్తున్నారు.