పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి – నారా లోకేష్

-

పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి అంటూ సోషల్‌ మీడియా వేదికగా నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు..ఆయనను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై నారా లోకేష్‌ స్పందించారు.


పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఫైర్‌ అయ్యారు. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదని మండిపడ్డారు. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అంటూ ఆగ్రహించారు. నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. చూడ‌టానికి వెళుతున్న న‌న్ను న‌డిరోడ్డుపై నిర్బంధించారని నిప్పులు చెరిగారు నారా లోకేష్.యువ‌గ‌ళం వ‌లంటీర్ల‌పై ఎటాక్ జ‌రిగింద‌ని ఫిర్యాదులు ఇస్తే, రివ‌ర్స్ కేసులు వారిపైనే బ‌నాయించిన పోలీసులు నాకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌ట‌! సిగ్గు! సిగ్గు! అంటూ రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news