RRR: ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్… టికెట్ ధరలు పెంచుకోవచ్చని జీవో జారీ

-

ఏపీ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా ట్రిపుల్ ఆర్ సినిమాకు టికెట్ ధరలు పెరుగుతాయా… అలాగే ఉంటాయా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ట్రిపుల్ ఆర్ డైరెక్టర్లు, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిశారు. అయితే తాజాగా ప్రభుత్వం టికెట్ ధరలను పెంచకోవచ్చని జీవో ఇచ్చింది. ప్రభుత్వ జీవోకు లోబడి టికెట్ ధరలు ఉండనున్నాయి. ఇప్పుడున్న ధరలకు అదనంగా మరో రూ. 75 పెంచుకోవచ్చని జీవో జారీ చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ పై మరో రూ. 75 పెంచుకునేందుకు అవకాశం లభించింది. 

ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా యూనిట్ రూ. 336 కోట్ల పెట్టినట్లు దర్శక నిర్మాతలు ఖర్చు పెట్టారని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రకారం రూ.100 కోట్లుకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకోవచ్చని జీవోలో ఉంది. దీంతో తొలి పదిరోజుల్లో కలెక్షన్లు రాబట్టుకోవాలనే ప్లాన్ లో ఉంది ట్రిపుల్ ఆర్ యూనిట్

Read more RELATED
Recommended to you

Exit mobile version