RRR : ఆర్ఆర్ఆర్ క‌లెక్షన్ల సునామీ.. హిందీలో రూ. 200 కోట్లు క్రాస్

ద‌ర్శ‌క దీరుడు జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను కొల్ల‌గొడుతున్నాయి. ఇక క‌లెక్షన్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బహుబ‌లి క‌లెక్షన్ రికార్డుల‌ను కూడా ఆర్ఆర్ఆర్ బ‌ద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌కు తెలుగు భాష లోనే కాదు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత కలెక్షన్లు చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇప్ప‌టికే తెలుగు లో ద‌మ్ము లేపుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్షన్లు.. హిందీలోనూ రికార్డుల‌ను సృష్టిస్తుంది. హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమా తాజా గా రూ. 200 కోట్ల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత హిందీలో రూ. 200 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ కు ముందు ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమా మాత్ర‌మే హిందీలో రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది. కాగ ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 950 కోట్లను క్రాస్ చేసి రూ. 1000 కోట్లకు చేరువులో ఉంది.