ప్రస్తుత క్యాబినెట్ లోని ఐదుగురు మంత్రులు కొనసాగే అవకాశం: కొడాలి నాని.

-

ఏపీ క్యాబినెట్ లో 24 మంత్రులు రాజీనామా చేశారు. ఈనెల 11న కొత్త మంత్రి వర్గం ఏర్పాటు కానుంది. గవర్నమెంట్ నడపడానికి కొంత మంది అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారని కొడాలి నాని అన్నారు. పలానా వాళ్లు ఉంటారని ముఖ్యమంత్రి గారు ఎవరి పేర్లు చెప్పలేదని ఆయన అన్నారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా… ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పామని… పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్దంగా ఉన్నామని కొడాలి నాని అన్నారు. క్యాబినెట్ లో కుల సమీకరణల్ని, అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకుని కొత్త కాబినెట్ ఉంటుందని ఆయన అన్నారు. గవర్నమెంట్ నడపడానికి, పార్టీని నడపాడానికి సమర్థులు కావాలని, పార్టీని మళ్లీ అధికారంలో తీసుకురావడానికి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో సీఎం ఒక్కరికే తెలుసు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. కొంతమంది మంత్రులు కంటిన్యూ అవుతారని ఆయన అన్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న ఐదారుగురు మంత్రులు మాత్రమే క్యాబినెట్ లో కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news