ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్: ఈనెల 14న సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ రిలీజ్

-

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ట్రిపుల్ ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది. ఈనెల 14న ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈనెల 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంపై మరింత హైప్ పెంచేందుకు సెలబ్రేషన్ ఆంథమ్ ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ముగ్గురు కూడా మెస్మరైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పిక్స్ చూస్తే తెలుస్తోంది.

తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈనెల 25న థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో హైప్ క్రియేట్ అయింది. చారిత్రక నేపథ్య కథతో భారీ స్థాయిలో సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు. వీరిద్దరికి జోడీగా ఒలివియా మోరిస్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version