సాంగ్ రిలీజ్ చేయ్‌రా అంటూ ఫ్యాన్ ట్వీట్.. దిమ్మ‌తిరిగే ఆన్స‌న్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేషన్ వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా కెల‌క్షన్లు రూ. 1,000 కోట్లు దాటేశాయి. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, తార‌క్ యాక్టింగ్ గుస్భామ్స్ వ‌చ్చేలా ఉన్నాయి. వీరి యాక్టింగ్ చేసి.. మెగా ఫ్యాన్స్, నంద‌మూరి ఫ్యాన్స్ కు పునకాలు వ‌చ్చాయి. ముఖ్యంగా నాటు నాటు… పాట‌లో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ డాన్స్ అలాగే, కొమురం భీముడో… అనే పాట‌లో తార‌క్ ఎక్స్‌ప్రెషన్స్ స్ట‌న్నింగ్ గా ఉంటాయి.

ఈ పాట‌లో ఎన్టీఆర్ చూస్తే.. ఫ్యాన్ అయిపోవ‌డం ఖాయం. త‌రక్ ఈ పాట‌లో అంతలా యాక్టింగ్ చేశాడు. కాగ ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో ప్ర‌స్తుతం ఆ సినిమాలోని ఫుల్ వీడియో సాంగ్ ల‌ను చిత్ర బృందం యూట్యూబ్ ల‌లో అప్ లోడ్ చేస్తున్నారు. నాటు నాటు.. పాట‌ను ఇప్ప‌టికే యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

అయితే ఒక అభిమాని ట్విట్ట‌ర్ లో ”కొమురం భీముడో పాట‌ను కూడా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయండి రా..” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దిమ్మ తిరిగేలా ఆన్స‌ర్ ఇచ్చింది. ”దానికి ఇంకా టైమ్ ఉంది రా..” అంటూ రీ ట్వీట్ చేసింది. కాగ ఈ ట్వీట్స్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.