ఆరెక్స్ బ్యూటీకి జాక్ పాట్‌..!

-

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాలో తన అందాల ప్రదర్శనతో ఆడియెన్స్ ను మెప్పించింది. కార్తికేయతో పాయల్ రొమాన్స్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అందం అభినయం తన సొంతమైన పాయల్ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మాస్ మహరాజ్ రవితేజ డిస్కో రాజా సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా కింగ్ నాగార్జున సరసన కూడా ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు.

నాగార్జున సూపర్ హిట్ మూవీ మన్మథుడు సినిమా సీక్వల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అవగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసేందుకు పాయల్ రాజ్ పుత్ రెడీ అవుతుంది. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా బంగార్రాజు సినిమా చేస్తున్న నాగ్ త్వరలోనే మన్మథుడు-2ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version