రాజ్‌కుంద్రాపై స‌చిన్ జోషి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

ఇప్పుడు బాలీవుడ్ లో రాజ్ కుంద్రా వ్య‌వ‌హారం ఎంత పెద్ద సంచ‌లనంగా మారిందో తెలిసింద‌. కాగా ఈక్ర‌మంలోనే అత‌నికి చెందిన సంస్థ సట్యుగ్ గోల్డ్ కు వ్యతిరేకంగా నటుడు సాచిన్ జోషి పోరాడుతున్న కేసులలో ఇప్పుడు ఆయ‌న‌కు మంచి ప‌ట్టు దొరికిన‌ట్టు అయింది. దీన్ని ఆధారంగా చేసుకుని స‌చిన్ .ఒఫి గోల్డ్ స్కామ్‌పై అలాగే రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న కేసు కూడా గెలిచారు.

ఇందులోభాగంగా బంగారం స్వాధీనంపై అప్పగించాలని, అలాగే జోషికి చట్టపరమైన చర్యలకు అయ్యే ఖర్చుగా రూ.3,00,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సచిన్ జోషి మాట్లాడుతూ త‌న న్యాయ పోరాటం కేవలం సాత్యుగ్ గోల్డ్ పై గెలిచింద‌న్నారు.

ఈ కేసులో శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా ఆరు సంవత్సరాల క్రితం తమకు ఇప్పటికే రూ.18,57,870 చెల్లించిన బంగారాన్ని వసూలు చేయడానికి రూ.25,50,000 జరిమానా చెల్లించాలని సత్యుగ్ గోల్డ్ కంపెనీని ఉసిగొల్పార‌న్నారు. అలాగే తాను కష్టపడి సంపాదించిన సొమ్ము మోస‌పోయాన‌ని, ఇప్పుడు తాను గెలిచాన‌ని చెప్పారు. త‌న‌పోరాటం ఫ‌లించింద‌ని, రాజ్ కుంద్రా మోసం బ‌ట్ట బ‌య‌లుఅయింద‌ని వెల్ల‌డించారు.