బుల్లి రామ్ చరణ్‌ను చూశారా.. చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన సుప్రీమ్ హీరో

-

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం మెగా హీరోల సందడే కనిపిస్తోంది. ఎఫ్2, గద్దలకొండ గణేష్ వంటి హిట్లతో వరుణ్ తేజ్.. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో సాయి ధరమ్ తేజ్, అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలీ హీరోలంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక రామ్ చరణ్ అటు నటుడిగా, ఇటు నిర్మాతగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలను నిర్మిస్తూ.. తను నటించి చిత్రాలతోనూ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఫుల్ బిజీగా ఉండగా.. చిరు-కొరటాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా పనులను చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. అయితే వీరు ఎంత బిజీగా ఉన్న పండుగ వస్తే చాలు అందరూ ఒక్క చోటుకే చేరుకుంటారు.

రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్‌ను ఏ రేంజ్‌లో సెలెబ్రేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇలా అంతా ఒక్క చోటకే చేరి భోగి మంటలు పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మ్యూజికల్ నైట్స్‌లో వారి పాటలను ప్లే చేయించుకుని ఎంజాయ్ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన ఓ పిక్ కూడా తెగ చక్కర్లు కొడుతోంది. చెన్నైలో ఉన్నప్పటి మెమోరీస్ అంటూ చిరు పెద్ద కూతురు సుష్మిత, రామ్ చరణ్, శ్రీజ, సాయి ధరమ్ తేజ్‌ల చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news