అమర్‌నాథ్‌ యాత్రలో సాయిపల్లవి.. నెట్టింట ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్​గా ఉండదు. తన వ్యక్తిగత విషయాలను దాదాపుగా షేర్ చేయదు. కానీ తాజాగా మాత్రం తన వ్యక్తిగత అనుభవానికి సంబంధించి ఓ పోస్టు చేసింది. పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్రకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సాయి పల్లవి ఆ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. తన మనసులోని భావాలను క్యాప్షన్​గా జత చేసింది.

‘‘వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి నేను పెద్దగా ఆసక్తి చూపించను. కానీ అమర్‌నాథ్‌ యాత్ర తీర్థయాత్ర గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎంతోకాలం నుంచి వెళ్లాలని కలలు కన్న యాత్ర ఇది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లు విసిరింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతి పట్టుకోవడం.. దారి మధ్యలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూసి.. ‘స్వామీ.. మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు?’ అని ప్రశ్నించేలా చేశాయి. దైవ దర్శనం అనంతరం నా ప్రశ్నకు సమాధానం దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే దృశ్యాన్ని చూశా. యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతూ ఉండగా.. వాళ్లలో ధైర్యం నింపడం కోసం చుట్టు పక్కన ఉన్నవాళ్లందరూ ‘ఓం నమః శివాయా’ అంటూ ఆ స్వామి నామాన్ని గట్టిగా స్మరించారు. వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు అడుగులు వేశారు.” అంటూ సాయిపల్లవి చేసిన ఎమోషనల్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version