డ్యాన్స్ లో అక్కను మించిన చెల్లి.. సాయిపల్లవి సిస్టర్ స్టెప్పులు చూశారా?

-

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ప్రస్తుతం తన చెల్లెలు పూజ కణ్నన్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో జాలీగా గడుపుతోంది. రెండ్రోజుల క్రితం పూజా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె తాను ప్రేమించిన అబ్బాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇక చెల్లి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయిపల్లవి హడావుడి అంతా ఇంతా కాదు. సింపుల్ శారీలోనే ఈ భామ అందరి మనసు కొల్లగొట్టేసింది.

మరోవైపు పూజా కణ్నన్ కూడా అందంలో కానీ, డ్యాన్స్లో కానీ తన అక్క సాయిపల్లవికి ఏ మాత్రం తీసిపోదు. అయితే పూజా, సాయిపల్లవి కలిసి ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీరితో కలిసి స్టెప్పులు వేశారు. ఇక పూజా డ్యాన్స్ చూసిన నెటిజన్లు అక్కకు ఏ మాత్రం తీసిపోకుండా చెల్లి డ్యాన్స్ చేస్తోంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరి మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news