వెంకటేశ్ ‘సైంధవ్’ టీజర్ రిలీజ్.. దుమ్ము లేపాడుగా

-

ప్రస్తుతం శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ ‘సైంధవ్’ అనే ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. క్రితం ఏడాది ‘ఎఫ్ 3’ సినిమాతో ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాగే ‘ఓరి దేవుడా’ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Saindhav Teaser – Telugu

అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే… ఈ టీజర్ లో విక్టరీ వెంకటేష్ చాలా అద్భుతంగా నటించాడు. అంతేకాదు ఇందులో చాలా సస్పెన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా ఎక్కువగా సౌత్ ఇండియాలోనే చేసినట్లు టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా జనవరి 13వ తేదీ 2024 సంవత్సరంలో రిలీజ్ కానుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరిలో రిలీజ్ అవుతోంది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news