గాజాపై ఆక్రమణ వేళ.. ఇజ్రాయెల్​కు బైడెన్ వార్నింగ్

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య భీకర యుద్ధం బీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ యుద్ధం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాజాను చుట్టుముట్టింది. అక్కడి నుంచి పౌరులను ఖాళీ చేయమని హుకుం జారీ చేసింది. గాజాను అష్టదిగ్బంధనం చేసి హమాస్​ను నామరూపాల్లేకుండా చేయాలని ఇజ్రాయెల్ పట్టుపడుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని అన్నారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నామని.. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని ఆ దేశానికి సూచించారు.

“గాజాను సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్‌ తన ఆధీనంలో ఉంచుకొంటుందని నేను అనుకోవడం లేదు.అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలో అక్కడి పాలన నిర్వహించాలి. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్‌ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుంది. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. అక్కడ ఉన్న అతివాద హమాస్‌ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news