బాక్సాఫీస్ వద్ద సలార్ ఊచకోత.. రెండ్రోజుల్లో 150 కోట్లు వసూల్!

-

పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. భారీ కలెక్షన్లతో రికార్డులు బద్ధలు కొడుతోంది. బాహుబలి తర్వాత వరుస ప్లాఫ్లతో సతమతమవుతున్న ప్రభాస్కు సలార్ ఊరటనిచ్చింది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించిన ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబడుతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ రెండ్రోజుల్లోనే రూ.150 కోట్లు వసూల్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అంచనా ప్రకారమే కలెక్షన్లలో జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.93.45 కోట్లు వసూల్ చేసి ఇదే జోరును రెండో రోజూ ప్రదర్శిస్తోంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.57.61 కోట్ల కలెక్షన్లు సాధించింది. రెండో రోజుల్లోనే సినిమా రూ. దాదాపు రూ.150కోట్లు దాటింది. ఇక వరల్డ్వైడ్గా సలార్ తొలిరోజు రూ. 178.7 కోట్లు వసూల్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news