మూడు రోజుల్లో రూ.400 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద సలార్ ర్యాంపేజ్ కంటిన్యూ

-

పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ మూవీ సలార్- పార్ట్ 1 సీజ్‍ ఫైర్ సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పుడు సెకెండ్ డే కన్నా మూడో రోజు భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది.

మూడు రోజులు కలిపి ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో రోజులో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లోకి చేరుకుంటుందని అంచనా. సోమవారం క్రిస్మస్ హాలీడే, మంగళవారం హాఫ్ డే కనుక ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.176 కోట్లు, రెండో రోజు రూ.119 కోట్లను సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నైజాంలో ఈ సినిమా మూడు రోజులు కలిపి రూ.44.80 కోట్లకుపైగా షేర్ సాధించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news