Salaar Movie : ‘సలార్’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.

Salaar Poster Reveals Trailer Date

అయితే..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఓ జీప్ పై ప్రభాస్ గన్ పట్టుకొని ఫైర్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పార్ట్-1 డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news