Salaar : OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ…స్ట్రీమింగ్ ఎందులో అంటే ?

-

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్. ఈ మూవీ ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత కాలర్ ఎగరేసేలా చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు.

 

SalaarOnNetflix

రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరుణంలోనే 750 కోట్లు వసూలు చేసింది సలార్. అయితే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్ : సీజ్ ఫైర్’ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో చూపించారు. ఇక ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news