మూడు పాత్ర‌ల‌తో వ‌స్తున్న స‌ల్మాన్ ఖాన్

-

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. ఒకే సినిమా లో మూడు విభిన్న పాత్ర ల‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నాడు. ఈ సినిమా లో స‌ల్మాన్ ఖాన్ తో పాటు అనిల్ క‌పూర్, ఫ‌ర్దేన్ ఖాన్ కూడా త్రిపాత్రాభినయం చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అలాగే ఈ సినిమా లో మొత్తం తొమ్మిది మంది హీరోయిన్ ల‌ను కూడా చిత్ర బృందం ఎంపిక చేస్తుంది. అయితే స‌ల్మాన్ ఖాన్, అనిల్ క‌పూర్, ఫ‌ర్ధేన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర ల‌తో గ‌తం లో వ‌చ్చిన సినిమా నో ఎంట్రీ.

ఈ సినిమా కు అనీష్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగ ఈ రీ ఎంట్రీ సినిమా కు సీక్వెల్ చేయ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి కోసం అనీష్ బ‌జ్మీ కథ ను కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తుంది. నో ఎంట్రీ సినిమా ను మ‌రింత బెస్ట్ గా చేయ‌డానికి స‌ల్మాన్ ఖాన్, అనిల్ క‌పూర్, ఫ‌ర్ధేన్ ఖాన్ లు త్రిపాత్రాభినయం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే రీ ఎంట్రీ లో న‌టించిన లారా ద‌త్తా, ఈషా దేఓల్ తో పాటు సెలీనా జైట్లీ తో కూడా చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. కాగ వ‌చ్చే ఏడాది మొద‌ట్లో నో ఎంట్రీ సినిమా సీక్వెల్ ను ప‌ట్టాల పైకి తీసుకు వెళ్లాల‌ని అనీష్ బ‌జ్మీ ప్ర‌య‌త్నం చేస్తున్నాడని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news