వాటే స్కీం…రూ.2 పొదుపుతో మీ చేతికి రూ.36 వేలు..!

-

కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల లాభాలను మనం పొందొచ్చు. అయితే కేంద్రం ఇచ్చే పథకాల్లో పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పధకం కూడా ఒకటి. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెడితే మంచి ప్రతీ నెలా కూడా పెన్షన్ ని పొందొచ్చు.

money
money

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.3 వేలు లభిస్తాయి. అంటే సంవత్సరానికి రూ.36 వేలు వస్తాయి. ఈ స్కీమ్ ని అసంఘటిత రంగంలోని కార్మికులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగింది.

ఇక ఎవరు ఈ పధకం లో చేరచ్చు అనేది చూస్తే.. ఈ స్కీమ్ లో 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరచ్చు. అయితే ప్రతీ నెలా కూడా కొంత డబ్బులు కట్టాలి. వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది.

ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.3 వేలు లభిస్తాయి. అంటే సంవత్సరానికి రూ.36 వేలు పొందొచ్చు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పధకం అందుబాటులో వుంది. ఈ పధకం లో చేరాలంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ కచ్చితంగా కావాలి.

పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాతి నుంచి ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.55 చెల్లించాలి. అంటే రోజుకు రూ.2 పొదుపు చేసి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేలు పెన్షన్ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news