ఓమిక్రాన్ కరోనా వేరియంట్ ఎఫెక్ట్… సందిగ్థంలో టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్…!

-

కరోనా మళ్లీ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. మళ్లీ కోత్త వేరియంట్ రూపంలో పంజా విసురుతోంది. ముఖ్యంగా సౌతాఫ్రికా, బోట్స్ వానా, జింబాబ్వే దేశాల్ల కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ధడ పుట్టిస్తోంది. కాగా ఇప్పుడు ఇదే విషయం టీమ్ ఇండియాను కూడా కలవరపెడుతోంది. వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనపై బీసీసీఐ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, ప్రాల్, కేప్ టౌన్, సెంచూరియన్‌లలో మొత్తం 10మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే భారత్ ఏ టీము సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. కాగా ఈ మ్యాచులపై కూడా సందిగ్థం ఏర్పడింది.

ఇప్పటికే పలు దేశాలు సౌతాఫ్రికాతో పాటు, బోట్స్ వానా, జింబాబ్వే దేశాల నుంచి రాకపోకను నిషేధించారు. ఓమిక్రాన్ వేరయంట్ కరోనా వైరస్ కారణంగా జర్మనీ, ప్రాన్స్, యూకే, ఇటలీ దేశాలతో సహా ఇండియా కూడా ఆఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించింది.

కాగా కొత్తగా వచ్చిన ఓమిక్రాన్ కరోనా వేరియంట్ తన స్పైక్ ప్రోటిన్ లో మార్పులు చేసుకోవడంతో మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని.. సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మఖ్యంగా యువకులకే ఇది ఎక్కువగా సోకుతుండటం కూడా భయాలను ఎక్కువ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news