వీడియో : ప్రియురాలు లైవ్ చాట్‌.. స‌ల్మాన్ ఏం చేశాడో తెలుసా..!

-

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాల ద్వారా వారి ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఎవ‌రికి వారు ఏదో ఒక కార్య‌క్ర‌మం చేయ‌డం దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇటు త‌మ అభిమానుల‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇక ప్ర‌స్తుతం ఏ ప‌ని చేసేందుకు స్కోప్ లేక‌పోవ‌డంతో అటు ప‌లువురు అభిమానులు కూడా ఇళ్ల‌ల్లోనే ఉంటూ త‌మ హీరోల వీడియోలు, సెల్ఫీలు, హీరోయిన్ల హాట్ ఫొటోలు చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ చేసిన కొంటె ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. సల్మాన్ ఖాన్‌ ప్రియురాలు లులియా వంతూర్‌.. సోషల్ మీడియాలో ఇటీవల లైవ్‌ చాట్ చేశారు. ఆ నేపథ్యంలో అనుకోకుండా ఆ లైవ్‌లోకి సల్మాన్‌ ఖాన్‌ వచ్చారు. అయితే ఆమె లైవ్‌లో ఉన్న విష‌యం తెలియ‌ని స‌ల్మాన్ ఆమె రూమ్‌లోకి వెళ్లాడు. అయితే ఆ త‌ర్వాత ఆమె లైవ్‌లో ఉంద‌న్న విష‌యం తెలుసుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు.

ఆ వీడియోలో లూలియా స‌ల్మాన్‌కు హాయ్ చెప్ప‌డంతో పాటు స‌ల్మాన్ అక్క‌డ నుంచి వెళ్లిపోయాక ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ సూప‌ర్బ్‌గా ఉంద‌ని స‌ల్మాన్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో పాటు సోదరి అర్పితా ఖాన్ శర్మ, అల్లుడు నిర్వాన్, హీరోయిన్‌ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌, వలూచ డిసౌజా, లులియా వంతూర్ అదే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే స‌ల్మాన్ అటు లాక్‌డౌన్‌లో ఉంటూనే వీలున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక వీడియో బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డంతో పాటు ఇలాంటి కొంటె ప‌నులు కూడా అప్పుడ‌ప్పుడు చేస్తున్నాడ‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news