సినిమాలకంటే వెబ్ సిరీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సమంత అక్కినేని ..!

-

అక్కినేని సమంత రీసెంట్ గా నటించిన జాను సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసందే. అంతక ముందు సమంత నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు మంచి సక్సస్ ని అందుకున్నాయి. అదే ఊపులో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని సమంత జాను సినిమాని అంగీకరించింది. కాని ఈ సినిమా సమంత కి షాకిచ్చింది. ఇక పెళ్ళి తర్వాత సమంత కంప్లీట్ గా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఒప్పుకుంటుంది. ఏమాత్రం గ్లామర్ పాత్రలకి ఆసక్తి చూపడం లేదు.

 

అయితే ప్రస్తుతం సమంత ఎక్కువగా వెబ్ సిరీస్ మీద ఆకస్తి చూపిస్తుంది. అందులో భాగంగానే ఫ్యామిలీ మాన్ 2 లో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ఈ పాత్ర ఇప్పటి వరకు సమంత సినిమాలలో కూడా చేయకపోవడంతో ఒప్పుకుంది. అంతేకాదు ఇక మీదట కూడా ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్దంగా ఉన్నానని మేకర్స్ కి తెలిపింది. అయితే వెబ్ సిరీస్ లో మాత్రం చైతూ తో కలిసి నటిస్తుందా లేదా అన్నది క్లారిటి లేదు. ఇక సమంత నటించే వెబ్ సిరీస్ కి మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారట. అనుకున్నట్టు గనక అన్నీ ఒకే అయితే ఇక మీదట వరసగా భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న వెబ్ సిరీస్ లలో నటించనుందని తాజా సమాచారం.

 

ఇక సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి నుంచి చాలా సెలెక్టివ్ గా ఉండాలనుకుంటుందట. అందుకు కారణం రీసెంట్ గా వచ్చిన జాను. ఈ సినిమా ఒకరకంగా సమంత క్రేజ్ ని దెబ్బ తీసిందనే చెప్పాలి. దాంతో పొరపాటున కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటుందట. అంతేకాదు కొత్తగా స్థాపించాలనుకుంటున్న సమంత సొంత నిర్మాణ సంస్థ లో మంచి కథా బలమున్న సినిమాలని నిర్మించాలని ఇదే నిర్మాణ సంస్థ ద్వారా వెబ్ సిరీస్ లని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version