పెళ్లి తర్వాత ఏమాత్రం తగ్గని సమంత.. హాట్ లుక్ లో అక్కినేని కోడలు..!

-

హీరోయిన్ సమంత రెండేళ్ల క్రితం అక్కినేని కోడలుగా కొత్త టర్న్ తీసుకుంది. అసలైతే పెళ్లైన హీరోయిన్స్ కు పెద్దగా సినిమా అవకాశాలు రావు కాని సమంత మాత్రం పెళ్లికి ముందు ఎలాంటి ఫాంలో ఉందో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే రేంజ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో చేతినిండా సినిమాలు చేస్తున్న సమంత ఓ వైపు వాణిజ్య ప్రకటనలను చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూసి ప్రముఖ సంస్థలు ట్విట్టర్ లో తమ ప్రొడక్ట్స్ కు సమంతను ప్రచారకర్తగా పెట్టుకుంటున్నారు. సమంత వాటిని కేవలం ట్విట్టర్, ఇన్స్టా గ్రాం లలో ప్రమోట్ చేస్తే సరిపోతుంది. సమంత ఇన్ స్టాగ్రాంలో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఫ్యాన్స్ కోసం టచ్ లో ఉంటూ వస్తున్న సమంత లేటెస్ట్ గా కుర్ కురే యాడ్ కూడా చేస్తుంది.

అంతేకాదు కొత్తగా లూయిస్ విట్టన్ అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కు సమంత ప్రచారకర్తగా ఉంటుంది. సమంత వాటిని ప్రమోట్ చేసేందుకు ఆ కాస్టూం వేసుకున్నారు. బ్లాక్ స్వెట్ షర్ట్, రెండ్ అండ్ బ్లాక్ మిక్స్ చిన్న స్కట్ వేసుకుని హాట్ స్టిల్స్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత కూడా సమంత ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version