లోకేశ్ సీటుపై చంద్రబాబు యూటర్న్ లు.. చినబాబు సీటు తలనొప్పిగా మారింది..!

-

ముందు కుప్పం అనుకున్నారు. తర్వాత భీమిలి అనుకున్నారు. తర్వాత విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు ఉన్న సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే.. మరో సమస్య ఆయన్ను తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ అభ్యర్థులందరినీ ఖరారు చేయడం కంటే.. చినబాబు లోకేశ్ కు సీటు ఇచ్చే విషయమై చంద్రబాబుకు తల ప్రాణం తోకకు వస్తోందట. ఎందుకంటే.. మిగితా టీడీపీ అభ్యర్థులు గెలిచినా.. ఓడినా పెద్ద ఫరక్ పడదు కానీ.. సొంత కొడుకు ఓడిపోతే చంద్రబాబుకు ఘోర అవమానమే కదా. అందుకే.. పక్కా టీడీపీ గెలుస్తుంది అని భావిస్తున్న నియోజకవర్గంలోనే లోకేశ్ ను బరిలో నింపాలనుకున్నారు చంద్రబాబు. దాని కోసం ఏపీలో ఉన్న నియోజకవర్గాలన్నింటినీ వడపోత పోస్తున్నారు చంద్రబాబు.

ఇప్పటికే లోకేశ్ ను బరిలో దించడానికి 10 నియోజకవర్గాల పేర్లు బయటికి వచ్చాయి. కానీ… లోకేశ్ కు మాత్రం టికెట్ ఇవ్వాలంటేనే భయపడిపోతున్నారు చంద్రబాబు. అసలే ఏపీలో లోకేశ్ అంటే చిన్నచూపు. ఆయన రాజకీయాలకు పనికిరారని, మైకుల ముందు లోకేశ్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని చెబుతుంటారు. అటువంటి నేపథ్యంలో ఒకవేళ చినబాబు ఓడిపోతే టీడీపీ పరువు పోతుందని చంద్రబాబు సేఫ్ నియోజకవర్గం కోసం వెతికే పనిలో పడ్డారు చంద్రబాబు.

ఓవైపు ఎన్నికలను నెల రోజుల సమయం కూడా లేకపోవడం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడం.. అయినప్పటికీ లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత రాకపోవడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. మరోవైపు టీడీపీ నేతలు కూడా చినబాబు సీటుపై గుర్రుగా ఉన్నారట. ఎందుకంటే.. చినబాబు కోసం ఎప్పటి నుంచో సీటు కోసం వేచి ఉన్న ఇతర నేతలకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు హ్యాండిస్తారోనని ఆవేదన చెందుతున్నారట.

అందుకే.. ముందు కుప్పం అనుకున్నారు. తర్వాత భీమిలి అనుకున్నారు. తర్వాత విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చినబాబు వల్ల టీడీపీకి మైనసే తప్ప ప్లస్ పాయింట్ ఏదీ లేదని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version