నిర్మాతగా మారిన సమంత.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు

-

ఇప్పటికే చాలా మంది నటీనటులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నిర్మాణ రంగంలోకి  అడుగుపెట్టారు. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్న సమంత తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వెకేషన్​ మోడ్​లో ఉన్నారు. ఇక ఇటీవలే వెకేషన్ నుంచి తిరిగొచ్చిన సమంత ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు తన రోజువారి పనుల్లో బిజీ అయ్యారు.

ఇక సోషల్ మీడియాలోనూ సామ్ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సామ్ ఓ పోస్టు పెట్టారు. త్వరలో కొత్త ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థకు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్​’ అనే పేరు పెట్టినట్లు.. సోషల్​ మీడియా వేదికగా లోగోను షేర్​ చేశారు. కొత్త తరం భావాలను వ్యక్తీకరించే, వారి ఆలోచనలను ప్రతిబింబించే కంటెంట్​ రూపొందించడమే తన నిర్మాణ సంస్థ లక్ష్యం అని సమంత తెలిపారు. ‘బ్రౌన్​ గర్ల్​ ఈజ్​ ఇన్​ ది రింగ్​ నౌ’ అనే పాట నుంచి స్ఫూర్తి పొంది నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా’ పేరును పెట్టారట.

Read more RELATED
Recommended to you

Latest news