టెర్ర‌రిస్టుగా క‌నిపించ‌నున్న స‌మంత‌.. ఇంత డేంజ‌ర్ గా ఎప్పుడు చేయ‌లే!

-

స‌మంత అంటే చిలిపిత‌నం, క్యూట్ స్మైల్‌, ముద్దొచ్చే లుక్‌.. ఇవే గుర్తుకొస్తాయి అభిమానుల‌కున ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు నెగెటివ్ రోల్‌లో ఎవ‌రూ చూడ‌లేదు. ఎంత‌సేపు గ్లామ‌ర్‌, క్యూట్ గ‌ర్ల్ లాంటి పాత్ర‌ల‌నే ఆమె చేస్తూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఓ డేంజ‌ర‌స్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ఏకంగా టెర్ర‌రిస్టుగా భ‌య‌పెట్ట‌బోతున్నారు.

అయితే ఈ క్యారెక్ట‌ర్ సినిమాలో కాదు. వెబ్ సిరీస్‌లో. ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్‌-2 తీస్తున్నారు.

ఈ సిరీస్‌లో స‌మంత ఓ టెర్ర‌రిస్టుగా క‌నిపించ‌నుంది. ఇందులో మ‌నోజ్‌, ప్రియ‌మ‌ణి కూడా న‌టిస్తున్నారు. డీ గ్లామ‌ర్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి. రాజ్ అండ్ డీకే దీనికి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విడుద‌లైన ట్రైల‌ర్ సూప‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక ఇంకెంత ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news