అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకలు.. ముఖ్యఅతిథిగా సమంత

-

అమెరికాలోని భారత సంతతి అమెరికన్లు ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కడి భారత సంతతి అమెరికన్లు.. న్యూయార్క్‌ నగర వీధుల్లో వార్షిక ప్రదర్శన నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించనున్న ఈ వేడుకకు భారత్​ నుంచి పలువురు ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారిలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, టాలీవుడ్ స్టార్ హోరియన్ సమంత, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉన్నారు.

అయితే ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఈ వార్షిక ప్రదర్శనకు సారథ్యం వహించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ .. సమంత ప్రధాన అతిథిగా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గౌరవ అతిథిగా పాల్గొంటారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, న్యూ ఇంగ్లండ్‌లకు చెందిన భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఈ నెల 20వ తేదీన జరిపే ఈ 41వ ఇండియా డే పరేడ్‌ భారతీయ విలువలు, ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news