Samantha : ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న సమంత ?

-

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ కోసం హీరో-హీరోయిన్ల అభిమానులంతా ఎప్పటికప్పుడు తమ ఆసక్తిని కనపరుస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. కశ్మీర్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది.

అయితే.. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. కుటుంబసభ్యులంతా గుడిలో యాగం చేస్తున్నట్టు వీడియోలో చూపించారు. సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా.. విజయ్ షర్ట్, పంచ కట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే… ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సమంత, విజయ్‌ లకు వివాహం జరుగుతుందా అని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో విజయ్‌ మరియు సమంత భార్యభర్తలుగా నటిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్ర బృందం సభ్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version