నటించిన కొన్ని సినిమాలు తోనే గోల్డెన్ లాగా పేరు సంపాదించుకున్న భామ సంయుక్త మీనన్. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో గోల్డెన్ దగ్గర ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. అయితే తాజాగా ఈ విషయంపై ఫైర్ అయింది ఈ భామ.
సంయుక్త మీనన్ తాజాగా తనను గోల్డెన్ లో అంటూ పిలవడంపై స్పందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్` అనేది చాలా చెత్త కాన్సెప్ట్. దాన్ని నేను అస్సలు అంగీకరించను. ఎందుకంటే మీరు సినిమాకి తక్కువ ఎఫర్ట్స్ పెట్టి, సినిమా సక్సెస్ అయ్యిందంటే అది లక్కీ. హీరోయిన్ మంచి స్క్రిప్ట్ లు సెలక్ట్ చేసుకుని, బాగా నటించి, మంచి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వచ్చే సక్సెస్ అసలైన సక్సెస్. అదొక ఓల్డ్ ఏజ్ కాన్సెప్ట్. దాన్ని దూరం పెట్టండి. అందులోకి హీరోయిన్‌ని లాగకండి. ఒక సినిమాకి కాస్టింగ్ అనేది ఆయా పాత్రకి, ఆమె న్యాయం చేస్తుందా? ఆ పాత్రని మోయగలదా? అనేదాన్ని బట్టి ఎంపిక ఉంటుంది. అదే తాన నమ్ముతాను..” అంటూ చెప్పుకోచ్చారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన సంయుక్త మీనన్ ఈ సినిమాతో మొదటి విజయం అందుకుంది. అనంతరం తమిళ హీరో ధనుష్ సరసన సర్ సినిమాల్లో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ భామ సాయిధరమ్ తేజ్ కు జంటగా విరూపాక్ష చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. రొటీన్ హారర్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన అందుతుంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ సంయుక్త పాత్రలకు మాత్రం మంచి మార్కులు పడినట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కళ్యాణ్ రామ్‌తో `డెవిల్` చిత్రంలో నటిస్తుంది.