తెలంగాణలో కలకలం.. యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శ్రీలక్ష్మీ పుష్కరిణి దగ్గర బాంబు ఉన్నట్లు కొందరు దుండగులు బుధవారం రాత్రి ఆలయ అధికారులకు కాల్ చేసి తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు.. పుష్కరిణి వద్ద సోదాలు నిర్వహించారు.

అక్కడ ఎలాంటి బాంబు లేదని చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈరోజు యాదగిరి గుట్టకు ప్రపంచ సుందరీమణలు రానున్న సంగతి తెలిసిందే. ఇక అటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దింతో అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టింది ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. చివరకు బాంబు మెయిల్ ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని పై ఆరా తీస్తున్నారు అధికారులు.