‘ఫిల్మ్‌ఫేర్‌’ నామినేషన్స్‌లో రష్మిక పేరు లేకపోవడంతో షాకయ్యా : సందీప్ వంగా

-

‘యానిమల్‌’లో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో గీతాంజలిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన నటనతో అందరినీ ఫిదా చేసింది. కొన్ని సీన్లలో అయితే రణ్‌బీర్‌ కపూర్‌ను డామినేట్ చేసింది. అయితే, తాజాగా జరిగిన ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల్లో ఉత్తమ నటి కేటగిరీలో రష్మికకు నామినేషన్‌ దక్కలేదు. దీనిపై దర్శకుడు సందీప్ వంగా స్పందించారు. రష్మికకు నామినేషన్ దక్కడంపై తాను షాక్‌కు గురైనట్లు చెప్పారు.

‘‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా హావభావాలు పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం.. ఇలాంటివన్నీ ఒకే సన్నివేశంలో చేయాలి. 11 నిమిషాలున్న ఆ సీన్‌లో రష్మిక అద్భుతంగా నటించింది. నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. ‘ఫిల్మ్‌ఫేర్‌’లో ‘యానిమల్‌’ 19 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. చిత్రబృందమంతా ఆ వేడుకకు హాజరైంది. దర్శకుడిగా నేను వెళ్లకపోవడం భావ్యం కాదు కాబట్టి హాజరయ్యాను’ అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news