ప్రజలు శిక్ష వేసినా బీఆర్ఎస్ కి బుద్ది రాలేదు : మంత్రి జూపల్లి

-

ప్రజలు శిక్ష వేసినా బీఆర్ఎస్ కి బుద్ది రాలేదని తెలంగాణ మంత్రి జూపల్లి  కృష్ణారావు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటకాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయనే ప్రాజెక్టుల వివాదం చేస్తున్నారు. కాళేశ్వరానికి ఆదరా బాదరగా అనుమతులు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు.

నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు కేసీఆర్ సభలు పెడతారట అని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రాజెక్టులను అప్పగింతకు ఒప్పుకున్నదే కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు. అంత ఖర్చు చేసినా అది ఉపయోగపడుతుందా అంటే అది లేదు. నిర్మించిన కొద్ది రోజులకే కుంగిపోవడమే.. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి కాళేశ్వరం ప్రాజెక్టుకి తెచ్చినంత తొందర అనుమతులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news