టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోయిన్ లో సంగీత ఒకరు. నటి సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో శ్రీకాంత్, నవీన్, వేణు లాంటి హీరోల సమస్యల వరుసగా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది నటి సంగీత.

ఇక ఇప్పుడు కూడా ఆంటీ పాత్రల్లో కనిపిస్తూ… ఇండస్ట్రీని దున్నేస్తోంది. అయితే అలాంటి నటి సంగీత తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొట్టింది. ఇంస్టాగ్రామ్ సంగీత క్రిష్ అని ఉన్న పేరును సంగీత యాక్టర్ అని మార్చున్నట్లు కొంతమంది ప్రచారం చేశారు.
విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యి.. ఇలా పేర్లు మార్చుకుందని సంగీత పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాజాగా స్వయంగా నటి సంగీత స్పందించారు. తన భర్తకు విడాకులు ఇవ్వడం లేదని… ఇంస్టాగ్రామ్ లో మొదటి నుంచి సంగీత యాక్టర్ అని మాత్రమే గుర్తు చేశారు. విడాకుల గురించి తప్పుడు ప్రచారం చేయకూడదని కోరారు. అదంతా ఫేక్ అన్నారు.