ఒక్క కొండే… కానీ మూడు శిఖరాలు? కోటప్పకొండ ఆశ్చర్యం!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన దేవాలయాలు కలవు వాటిలో ప్రముఖంగా మనం చెప్పుకోదగ్గ దివ్య క్షేత్రం కోటప్పకొండ. శివుడు దక్షిణామూర్తిగా ఈ కొండపైనే కొలువై విశేషమైన పూజలను అందుకుంటున్నాడు. మన చుట్టూ ఉండే ఎన్నో అద్భుతమైన దేవాలయాలు,వాటి విశేషాలు మనకి ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియదు. మరి అలాంటి విశేషాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతమైన దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంల వున్న కోటప్పకొండ ఒక ప్రసిద్ధ శివ క్షేత్రం.ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని త్రికూటాచలం లేదా త్రికోట పర్వతం అని పిలుస్తారు. ఈ విశిష్టతతో పాటు ఈ క్షేత్రం యొక్క పురాణ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత భక్తులను ఆకర్షిస్తుంది. చూడడానికి మూడు శిఖరాలు ఉన్న కొండ మాత్రం ఒకటే.. ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మూడు శిఖరాల రహస్యం : కోటప్పకొండ ఒకే కొండ అయినప్పటికీ ఏ దిశ నుంచి చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తాయి. ఈ శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలుగా పిలుస్తారు. ఇవి త్రిమూర్తులకు ప్రతీకగా చెబుతారు. 1587 అడుగుల ఎత్తు 1500 ఎకరాల వైశాల్యంలో ఈ కొండ భక్తులకు దివ్యమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ మూడు శిఖరాలు ఏ దృక్కోణం నుంచి చూసిన ఒకే విధంగా కనిపించడం ఈ క్షేత్రం ప్రత్యేకత.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: కోటప్పకొండ లో శివుడు త్రికోటేశ్వరుడిగా దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు పురాణ కథనం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఈ కొండపై బాలుడిగా రూపం చెంది తపస్సు చేశాడు. బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు ఇక్కడ శివుడిని ఆరాధించి జ్ఞానోపదేశం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రుద్ర శిఖరంపై పాతకోటయ్య గుడి ఉంటుంది ఇక్కడ ఒక అడుగు ఎత్తైన శివలింగం ఉంది. బ్రహ్మ శిఖరం పై ప్రధాన ఆలయం ఉంటుంది.అలాగే గొల్లభామ ఆలయం కొండపై కలదు.

One Hill, Three Peaks The Marvel of Kotappakonda

చరిత్ర, సాంప్రదాయం : కోటప్పకొండ ఆలయం క్రీ.శ. 1172కి ముందే ఉనికిలో ఉందని శాసనాలు తెలియజేస్తున్నాయి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ నిర్వహణకు భూమిని దానం చేశారు. క్రీ.శ.1761లో రాజా మల్రాజు నరసింహారాయులు కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించారు ఇది భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. గొల్లభామ అనే భక్తురాలి భక్తికి మెచ్చి శివుడు బ్రహ్మశిఖరం పై కొలువైనట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి.కాకులు దూరని కారడివి అని మనం వింటాం కానీ, కాకులు వాలని కొండ గురించి మనం ఎక్కడ వినివుండం. అలాంటి కొండ ఈ కోటప్పకొండ.ఇక్కడ కొండ పై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతంలో ప్రతి చెట్టుపై  కాకుల్ని చూస్తాం. కాని ఈ కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో ఎక్కడా కూడా ఒక్క కాకి కూడా కనిపించదు. ఇప్పటివరకు ఈ కొండపై కాకులు వాల లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

భక్తుల కోసం సౌకర్యాలు: మహా పుణ్యక్షేత్రం కోటప్పకొండకు చేరుకోవడానికి నరసరావుపేట చిలకలూరిపేట నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. కొండపై తిరుమల దేవస్థానం సత్రం ప్రభుత్వ అతిథి గృహాలు భక్తులకు అందుబాటులో కలవు. కొండపై అన్నదాన సత్రాలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో కలదు. కార్తీకమాసం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ తిరునాళ్ళు ఘనంగా జరుగుతాయి. భక్తులు ప్రభ లతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందాయి.

కోటప్పకొండ ఒక పవిత్ర క్షేత్రం మాత్రమే కాదు ప్రకృతి యొక్క అద్భుతమైన అనుభూతిని అందించే దివ్య ధామం. ఈ కొండను సందర్శించడం ద్వారా జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ఉత్తేజం, శివ అనుగ్రహం పొందవచ్చని భక్తులు నమ్మకం. కోటప్పకొండను సందర్శించి ఈ దివ్య క్షేత్రం యొక్క అద్భుతాన్ని అనుభవించండి.

Read more RELATED
Recommended to you

Latest news