శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ రూమర్స్​పై సారాఅలీఖాన్ జబర్దస్త్ రియాక్షన్

-

ఇండియాలో క్రికెట్.. బాలీవుడ్​ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పటికే ఈ కాంబోలో చాలా మంది ప్రేమించి పెళ్లాడి.. హాయిగా జీవితం సాగిస్తున్నారు. ఇక ఈ లిస్టులో గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ యంగ్ క్రికెటర్ శుభ్​మన్ గిల్​తో ప్రేమలో ఉన్నట్లు చాలాకాలం నుంచి రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై సారా స్పందించింది. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే, ఒక కండిషన్‌ మాత్రం పెట్టింది.

‘‘నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని మొదలుపెడతాను. అతడు ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్‌, నటుడు, వ్యాపారవేత్త.. ఇలా రంగం ఏదైనా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు. ’’ అని చెప్పుకొచ్చింది. ఇక తాను ఓ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా’’ అంటూ అసలు సంగతి బయటపెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version