గిల్‌ కు షాక్‌…రామ్ చరణ్‌తో సారా టెండూల్కర్ రొమాన్స్‌!

-

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్​గా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ గురించి తెలుసుకున్న అంతర్జాతీయ ప్రేక్షకులు.. ఆర్ఆర్ఆర్​కు ముందు చరణ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమాలు చూసి ఈ హీరో స్టామినా ఏంటో అర్థం చేసుకుంటున్నారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు కియారా అద్వానీ లు జంటగా నటిస్తున్న తాజా చిత్రం “గేమ్ చేంజర్”.

Sara Tendulkar to make her bollywood bebut with Hero Ram Charan
Sara Tendulkar to make her bollywood bebut with Hero Ram Charan

ఇది ఇలా ఉండగా… బీటౌన్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో కలిసి ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని హీరోయిన్ గా పెడితే బాగుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. అందుకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ అయితే సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news