యూ ట్యూబ్‌ను ఊపేస్తున్న సారంగ‌ద‌రియా.. ల‌వ్‌స్టోరీకి ఫుల్ క్రేజ్‌

-

సినిమాలు పాపుల‌ర్ కావ‌డంలో పాట‌ల‌ది ప్ర‌త్యేక పాత్ర. ఒక్క పాట క్లిక్ అయినా స‌రే ఆ సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తుంది. మొన్న అల వైకుంఠ‌పురం పాట‌ల‌తో ఆ సినిమాకు ఎంత హైప్ వ‌చ్చిందో చూశాం. అలాగే ఉప్పెన పాట‌లు ఆ సినిమాను మ‌రో లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఇదే దారిలో శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమాకు ఫుల్ క్రేజ్ వ‌స్తోంది.

ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ల‌వ్‌స్టోరీలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్లవి న‌టిస్తున్నారు. మొద‌టి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో తెలంగాణ జాన‌ప‌ద పాట సారంగ‌ద‌రియాను వాడ‌టంతో అంచ‌నాలు పెరిగాయి.

ఈ సాంగ్ విడుద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఊహ‌కంద‌ని రీతిలో సోష‌ల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఎక్క‌డ చూసినా ఇదే క‌నిపిస్తోంది. ఇప్పుడు మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. యూ ట్యూబ్‌లో 200మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంకా విజయవంతంగా సాగుతోంది సారంగదరియా. ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ వాయిదా ప‌డ్డా కానీ ఈ పాట‌తో క్రేజ్ మాత్రం త‌గ్గ‌ద‌ని తెలుస్తోంది.ల‌

Read more RELATED
Recommended to you

Latest news