ఈ దువ్వెనతో మీ జుట్టు రాలదు.. మరింత పెరుగుతుంది

-

సాధారణంగా హెయిర్‌ స్టైల్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కేవలం ఆడవారికే కాదు మగవారికి కూడా జుట్లు ఇష్టం. అందుకే దీనికి ఎంతో కేర్‌ తీసుకుంటాం. అయితే, జుట్టు రాలడానికి మీరు ప్రతిరోజూ వాడే దువ్వెన పాత్ర కూడా ఉంటుందని మీకు తెలుసా? అన్ని ఇళ్లలో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌ దువ్వెనలే వాడతారు. కానీ, చెక్క దువ్వెనలే మన జుట్టుకు మేలు చేస్తాయి. ఈ వేప చెక్కతో చేసిన దువ్వెనతో లాభాలను తెలుసుకుందాం.

  • జుట్లు బలంగా ఉండాలంటే చెక్కతో చేసిన దువ్వెననే వాడాలి. దానితో దువ్వినప్పుడు అది మీ స్కాల్ప్‌ని ప్రెస్‌ చేసినట్లుగా ఉంటుంది, దాంతో ఆక్యుపంక్చర్‌ పాయింట్స్‌ ట్రిగ్గర్‌ అవుతాయి, స్కాల్ప్‌పై మసాజ్‌ చేసినట్లు అవుతుంది. దీని వల్ల బ్లడ్‌ సర్క్యులేషన్‌ మెరుగవుతుంది.
  • ఈ వేప చెక్క దువ్వెన వల్ల స్కాల్ప్‌ మీద ఉండే ఆయిల్‌ను సమానంగా స్కాల్ప్‌ అంతా డిస్ట్రిబ్యూట్‌ అవుతాయి. ఈ దువ్వెనతో తల దువ్వినప్పుడు చిక్కు పడకుండా ఉంటుంది. హెయిర్‌ ఫాల్‌ కూడా తగ్గుతుంది. అదేవిధంగా మీ జుట్టు మెరుస్తూ, ఎంతోఆరోగ్యంగా ఉంటుంది.
  • చెక్క దువ్వెన వాడడం వల్ల బ్లడ్‌ సర్క్యులేషన్‌ బాగా పెరిగి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. చెక్క దువ్వెన సీబమ్‌ ప్రొడక్షన్ని రెగ్యులేట్‌ చేసి మలినాలని తొలగిస్తుంది.
  • హెయిర్‌ బ్రేకేజ్,డ్యామేజ్‌ ఉండదు.
  • చుండ్రు వల్ల కూడా మన జుట్టు ఊడిపోతుంది. చెక్క దువ్వెన జుట్టు మృదువుగా ఉంటుంది, స్కాల్ప్‌కి ఎలాంటి హానీ చేయదు, అందువల్ల చుండ్రుని కంట్రోల్‌ చేయడం తేలికవుతుంది. ముఖ్యంగా ఇది వేపతో తయారు చేసిన దువ్వెన కాబట్టి దురద కూడా రాదు.
  • ప్లాస్టిక్‌ దువ్వెనలు కొంత మందికి ఎలర్జీ కలుగచేయవచ్చు. మీది సెన్సిటివ్‌ స్కాల్ప్‌ అయితే కనుక మీరు చెక్క దువ్వెన వాడడమే మంచిది. ఎలాంటి ఎలర్జిక్‌ రియాక్షన్ కి దారి తీయవు.
  • ఈ దువ్వెన వల్ల మీకు లభించే ఇంకొక బెనిఫిట్‌ ఏమిటంటే అది జుట్టుకి మంచి బౌన్స్‌ని ఇస్తుంది
  • చెక్క దువ్వెన్న పళ్ల మధ్యలో పెట్రోలియం జెల్లీ అప్లై చేయండి. కొంత సేపటి తరువాత మెత్తని బట్టతో తుడిచేయండి.
  • లేకపోతే ఆయిల్‌ కూడా వాడవచ్చు. ఫ్లాక్స్‌ సీడ్‌ ఆయిల్‌ తీసుకుని దువ్వెన అంతా బాగా పట్టించండి. ఒక గంట తర్వాత మెత్తని బట్టతో తుడిచేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news