తెలంగాణాలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. కరోనా రెండవ దశ వ్యాక్సిన్ పంపిణీ పై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళారు. వైద్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి హాజరుకానున్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సిఎం ముందు పలు కీలక వివరాలను ఉంచనున్నారు.
సీజనల్ వ్యాధులపై చర్చ జరగనుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ఆగిన వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. వ్యాక్సిన్ పంపిణీకి గోబల్ టెండర్ల పై అధికారులతో సీఎం చర్చ జరుపుతారు. రేపు ఇరిగేషన్,వ్యవసాయ శాఖ పై సీఎం సమీక్ష చేసే అవకాశం ఉంది. ఎరువుల పంపిణీ ,విత్తనాల విక్రయాలకు ఇబ్బందులు కలుగ కుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. రైతులు పొలాల్లో ఏ పంటలు వేయాలన్న దానిపై సమీక్షలో చర్చ జరుపుతారు. వాక్సిన్ గ్లోబల్ టెండర్ లకు ఏపీ సిఎం వెళ్ళిన సంగతి తెలిసిందే.