బాలీవుడ్ హీరోయిన్ , బీజేపీ ఎంపీ కంగనా రౌత్ పై కేసు పెట్టారు హనుమంతన్న. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత హనుమంతరావు మాట్లాడుతూ…. కంగనా రౌత్.. రాహూల్ గాంధీ నీ తిట్టి తప్పు చేసిందని… కంగనా రౌత్ ను బీజేపీ కంట్రోల్ చేయాలని కోరారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడి పాపులర్ కావాలని చూస్తుందని ఆగ్రహించారు.
రాహుల్ గాంధీ పై కంగనా మాటలకు మేము హర్ట్ అయ్యామన్నారు. అంబర్ పేట లో పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎవరి గురించి.. ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని చురకలు అంటించారు. రైతుల కు వ్యతిరేకి..అంటూ కంగనాపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన కాదా..? అని నిలదీశారు. కంగనా… సినిమా జీవితం లో ఎలా ఉన్నా.. నీకు రాజకీయాలు ఒంట పట్టలేదన్నారు. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలని కోరారు. స్మశాన వాటిక లు కూడా ఆక్రమించి ఇల్లు కడుతున్నారన్నారు. వాటిని కూడా అపాలని కోరారు.